ఈనెల 20 నుంచి నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శుల పరీక్షలకు కడప జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశామని కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 843 పోస్టులకు 51,505 మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నట్లు పేర్కొన్నారు. 20న కడప, పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటి ప్రాంతాల్లో 95 కేంద్రాల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటిరోజు మాత్రమే ఆరు ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించి... 21 నుంచి అన్ని పరీక్షలు కడప నగరంలోనే నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
మెుత్తం అభ్యర్థుల్లో 25 వేల మంది మహిళా అభ్యర్థులు కూడా ఉన్నారన్న కలెక్టర్... 967 మంది దివ్యాంగులు పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన అభ్యర్థులకూ పరీక్ష రాయడానికి అనుమతి ఉందన్న ఆయన...వారి కోసం పరీక్ష కేంద్రంలో ప్రత్యేక గదులను ఏర్పాటు చేశామన్నారు. ప్రతి అభ్యర్థి మాస్కులు ధరించి రావాలన్న కలెక్టర్...పారదర్శకంగా పరీక్షలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు.
ఇదీచదవండి
చలో అమలాపురానికి అనుమతి నిరాకరణ... భాజపా నాయకుల గృహ నిర్బంధం