ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా కడప జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత అధికారులదే అని కడప జిల్లా కలెక్టర్ హరికిరణ్ అన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై ఆయన తన ఛాంబర్ లో అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ముఖ్యంగా ఆరోగ్యం, విద్యా రంగాల్లో పూర్తిస్థాయిలో మౌలిక వసతులను కల్పించేందుకు అవసరమైన అంశాలను గుర్తించి డీపీఆర్ సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పులివెందుల నియోజకవర్గంలో ఉన్న మొత్తం ఆరోగ్య సబ్ సెంటర్లలో... అత్యధికంగా ప్రజలు వచ్చే వాటిపై దృష్టి పెట్టి, యుద్ధప్రాతిపదికన తీర్చాల్సిన అవసరాలను గమనించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా వ్యాప్తంగా ప్రతి ఉన్నత బాలికల పాఠశాలలు, అనుబంధ వసతి గృహాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రాలు, పాఠశాలల్లో పైకప్పులు, కుంగిన గోడలకు మరమ్మతులు చేయించే ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను కలెక్టర్ హరికిరణ్ ఆదేశించారు.
ఇవీ చూడండి: