పోలీసు అమర వీరుల కుటుంబాలను కడప జిల్లా పోలీసు శాఖ తరఫున అన్ని విధాలా ఆదుకుంటామని అదనపు ఎస్పీ కాసిం సాహెబ్ అన్నారు. విధి నిర్వహణలో మృతి చెందిన ముగ్గురు పోలీసుల కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అలాగే పోలీసులు ఆరోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క పోలీసు ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం చాలా ముఖ్యమన్నారు.
ఇదీ చదవండి: 'ఎస్సీ వర్గీకరణపై ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి స్పందించాలి'