ETV Bharat / state

130 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా! - రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జా

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లిలో 130 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొంత మంది కబ్జా చేశారు. రాజకీయ నాయకుల అండదండలతో, అధికారులతో కుమ్మకై అందులో కొంత భూమిని ఆన్​లైన్​లో నమోదు చేసుకున్నారు.

Kabza of public lands in cadapa district
ప్రభుత్వ భూముల కబ్జా
author img

By

Published : Feb 25, 2020, 7:25 AM IST

ప్రభుత్వ భూముల కబ్జా

కడప జిల్లా ఓబులవారిపల్లె మండలం చిన్నంపల్లిలో 130 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేశారు. ప్రభుత్వం పేదల ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వభూమి లేక తంటాలు పడుతుంటే, కొందరు అధికారులు, రాజకీయ నాయకుల అండదండలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారు. కొండలు, చెరువులు, ఏవైనా కనబడితే చాలు కబ్జా చేస్తున్నారు. చిన్నంపల్లి పంచాయతీ పరిధిలో 22 02 సర్వేనెంబర్​లోని భూమి ఆర్​ఎస్​ఆర్​లో ప్రభుత్వ భూమిగా ఉంది. దీన్ని కొంతమంది కబ్జా చేశారు. అయితే ఈ భూమి కొంతమంది అధికారులు, అక్కడ ఉన్న రాజకీయ నాయకుల అండదండలతో అన్​లైన్​లో నమోదు చేశారు. దీనిపై స్థానిక తహసీల్దార్​ను వివరణ కోరగా ఇంత ముందు పని చేసిన అధికారులు కొంతమంది స్థానికులకు అన్​లైన్​లో నమోదు చేసిన మాట వాస్తవమేనని, అయితే ఈ విషయంపై అధికారులకు దృష్టికి తీసుకుపోయి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా సరే ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఇదీ చూడండి:'వైకాపా ప్రభుత్వం పేదల కడుపు కొట్టింది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.