సమస్యల పరిస్కారం కోసం కడప రిమ్స్ లో జూడాలు చేస్తున్న సమ్మె నాల్గో రోజుకు చేరుకుంది. నల్లపట్టీలు ధరించి విధులకు హాజరయ్యారు. ప్రభుత్వం ఇప్పటి వరకు తమ సమస్యలను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం వరకు నల్లపట్టీలు ధరించి విధులకు హాజరవుతామని చెప్పారు.
వచ్చే బుధవారం నుంచి కరోనా బాధితులకు వైద్య సేవలకు హాజరవ్వబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరిస్తూ జీవోలను విడుదల చేస్తే… రెట్టించిన ఉత్సహంతో పని చేస్తామని తెలిపారు. ఇప్పటికే 20 మంది జూడాలు కరోనా బారిన పడ్డారన్నారు. ఉన్న వారితోనే విధులు నిర్వహించాలంటే కష్టమని చెప్పారు.
ఇవీ చదవండి: