ETV Bharat / state

'ఆక్సిజన్​ను అనవసరంగా వృథా చేయొద్దు'

కడపజిల్లా రాజంపేటలో ఆక్సిజన్ పంపిణీపై జేసీ, సబ్ కలెక్టర్ మిగతా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. రోగులకు ఎంత అవసరమో ఆ మేరకు మాత్రమే ఆక్సిజన్​ను వినియోగించాలని, అనవసరంగా వృథా చేయవద్దని సూచించారు.

rajampeta
జేసీ , సబ్ కలెక్టర్ సమావేశం
author img

By

Published : May 13, 2021, 11:40 PM IST

ఆక్సిజన్ సరఫరా అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని కడప జిల్లా జాయింట్ కలెక్టర్ సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్​తో కలిసి జిల్లా స్థాయి ఆక్సిజన్ వార్ రూం టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. రెవెెన్యూ, పోలీసు, ట్రాన్స్​పోర్ట్, ఇండస్ట్రీస్, మున్సిపల్, పంచాయతీ తదితర శాఖల అధికారులతో.. కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని జేసీ తెలిపారు. ఈ కమిటీకి రాజంపేట సబ్ కలెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారని, కమిటీ నిరంతరం పనిచేస్తుందని పేర్కొన్నారు. కేవలం ఆక్సిజన్ వినియోగించడమే కాదు ఆక్సిజన్ వృథాను అరికట్టడం కూడా ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో ముఖ్యమని.. దీనిపై అందరికీ అవగాహన కల్పించాలన్నారు.

ఇదీ చూడండి.

పిల్లలపై 'కొవాగ్జిన్' ట్రయల్స్​కు డీసీజీఐ గ్రీన్​సిగ్నల్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.