సీపీ బ్రౌన్ గ్రంథాలయం(cp brown library kadapa news) ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి జానమద్ది హనుమచ్ఛాస్త్రి చేసిన కృషి ఎంతో ఉందని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మఠం వెంకటరమణ అన్నారు. సంస్థను నెలకొల్పడం ఒక ఎత్తయితే.. నిలబెట్టడం మరో ఎత్తు అని కొనియాడారు. జానమద్ది హనుమచ్ఛాస్త్రి 97వ జయంతిని పురస్కరించుకొని కడపలోని సి.పి బ్రౌన్ గ్రంథాలయంలో జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో సాహితీవేత్తలకు పురస్కారాలను అందజేశారు.
జానమద్ది హనుమచ్ఛాస్త్రి జీవిత విశేషాలను రాబోయే తరాలకు చెప్పడం ఎంతో కీలకమన్నారు. ఆయన జీవిత కథ చదివితే..సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి చేసిన సేవ ఎలాంటిదో అర్థమవుతుందన్నారు. గ్రంథాలయాల అభివృద్ధికి ఊరు వాడ తిరిగి పుస్తకాలు సేకరించడం అభినందనీయమన్నారు.
ఇదీ చదవండి