మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సహా మరో 84 మందిపై కడప జిల్లా జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నెల 14వ తేదీ రాత్రి జమ్మలమడుగు మండలం దేవగుడి సమీపంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రెడ్డయ్య, రామాంజనేయులు అనే వ్యక్తులపై దాడి చేశారు. వారిపై దాడికి దిగింది భాజపా నేత ఆదినారాయణరెడ్డి మనుషులే అని ఆరోపిస్తూ అదే రోజు రాత్రి జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. విచారణ అనంతరం మాజీ మంత్రి సహా మరో 84 మందిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పట్టణ సీఐ మధుసూదన్‌రావు తెలిపారు.
ఇదీ చూడండి:
చట్టాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానాలే శిక్షిస్తాయి: నారా లోకేశ్