ETV Bharat / state

వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ - వివేకానంద రెడ్డి హత్య కేసులో విచారణ

వైఎస్ వివేకా హత్య కేసులో విచారణ కొనసాగుతోంది. వైకాపా నేతలు వైఎస్‌ మనోహర్‌రెడ్డి, మరో వ్యక్తిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.

investigation in ys viveka murder case
వివేకా హత్య కేసులో కొనసాగుతున్న విచారణ
author img

By

Published : Dec 3, 2019, 7:33 PM IST

వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య కేసులో సిట్ విచారణ కొనసాగుతోంది. పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు చెందిన నలుగురు అనుమానితులను సిట్ అధికారులు కడపలో విచారిస్తున్నారు. నిన్న నలుగురిని విచారించిన పోలీసులు... ఇవాళ మరో నలుగురి విచారణకు పిలిచారు. పులివెందుల నుంచి వై.ఎస్.మనోహర్ రెడ్డితో పాటు మరో వ్యక్తిని కడపకు పిలిచి విచారించారు.

వివేకాకు ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. మనోహర్ రెడ్డిని నిన్న కూడా పోలీసులు విచారణకు పిలిచారు. సింహాద్రిపురం మండలానికి చెందిన తెదేపా మాజీ జెడ్పీటీసీ పోరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ముసల్ రెడ్డిపల్లెకు చెందిన నాయకున్ని విచారణకు పిలిచారు. వీరు నలుగురిని కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో సిట్ విచారిస్తోంది. గతంలో కూడా వీరందరినీ సిట్ అధికారులు విచారించారు. మూడు నెలల తర్వాత మరోసారి విచారణ చేస్తున్నారు.

ఇప్పటికే ఈ కేసులో 1300 మంది అనుమానితులను పోలీసులు విచారించారు. కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోవడంతో... మరో దఫా విచారణ చేస్తున్నారు. ఈసారి ఒకే పార్టీకి చెందిన వారిని కాకుండా... ప్రతిరోజు రెండు పార్టీలకు చెందిన అనుమానితులను పిలిచి విచారిస్తున్నారు. మరో వారం రోజుల పాటు ఈ విచారణ కొనసాగుతుందని సిట్ అధికారులు అంటున్నారు.

ఇదీ చదవండి

'విశాఖకు గోదావరి జలాలు... వయా పోలవరం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.