కడప జిల్లా వివేకా హత్యకేసులో (viveka murder case) 61వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథిగృహంలో సీబీఐ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. పులివెందులకు చెందిన చెప్పుల దుకాణం యజమాని మున్నాను అధికారులు ప్రశ్నిస్తున్నారు. మూడు నెలల కింద మున్నాను సీబీఐ పలుమార్లు విచారించింది. సుంకేశులకు చెందిన ఉమాశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, కారు డ్రైవర్ దస్తగిరి విచారణకు హాజరయ్యారు. మరో బృందం సునీల్ యాదవ్ కస్టడీ పిటిషన్‌పై పులివెందుల కోర్టుకు వెళ్లింది.
వివేకా హత్య జరగడానికి ఆరు నెలల ముందు దస్తగిరి పని మానేశాడు. ఇతడు ఇచ్చిన కొన్ని కీలక ఆధారాలతో గత నెలరోజుల నుంచి సీబీఐ అధికారులు పలువురు అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. హత్య జరిగిన రోజు సాక్ష్యాలు తారుమారు చేశారనే కేసులో రెండేళ్ల కిందట ఎర్రగంగిరెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బెయిలుపైన ఉన్న వీరిని సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఘటన రోజు ఏం జరిగిందన్న విషయంపై.. మరింత స్పష్టత వచ్చే దిశగా కీలక సమాచారాన్ని రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.
వివేకా హత్య కేసును (viveka murder case) సవాలుగా తీసుకున్న సీబీఐ అధికారులు విచారణలో దూకుడు పెంచారు. గత 61 రోజులుగా పలువురు అనుమానితులను విచారించారు. ఈ కేసులో అధికారులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు. 2019 మార్చి 15న వివేకా దారుణహత్యకు గురికాగా..మార్చి 14 అర్ధరాత్రి పులివెందులలో అనుమానాస్పదంగా తిరిగిన పలు వాహనాల వివరాలను సేకరించి ఆ దిశగా విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: