ETV Bharat / state

చెల్లని నాణేలు... నకిలీ నోట్లతో బెంబేలు

కడప జిల్లా ప్రొద్దుటూరులో చెల్లని నాణేలు, నకిలీ నోట్లతో ప్రజలు నష్టపోతున్నారు. బ్యాంకులో తీసుకున్న నగదులో కూడా నకిలీ నోట్లు రావటంతో ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

invalid currency
నకిలీ నోట్లు.. చెల్లని నాణేలు
author img

By

Published : Jan 31, 2021, 2:20 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో చెల్లని పది రూపాయల నాణేలు, నకిలీ రూ.100 నోట్లతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నకిలీ నోట్లను కనిపెట్టాల్సిన బ్యాంకు అధికారులే ఖాతాదారులకు ఇస్తున్నారు. వీరు బ్యాంకులకెళ్లి తీసుకునే నగదు నోట్ల కట్టల్లో నుంచి దొంగ నోట్లు లభ్యమవుతున్నాయి. వంద నోటు తీసుకుని ఏదేని వస్తువును కొనుగోలు చేసేటప్పుడు దుకాణదారుడు ఇట్టే నకిలీ నోటని గుర్తిస్తున్నారు. బ్యాంకు అధికారి కనిపెట్టలేకపోవడం బాధాకరమని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రొద్దుటూరు మండలం గోపవరం పరిధిలోని ఏపీజీబీ బ్యాంకుకెళ్లిన ఓ ఖాతాదారుడు తన ఖాతా నుంచి రూ.3000 తీసుకోగా అందులో ఓ వంద నోటు తీసుకుని అంగడికెళ్లగా అక్కడ దొంగనోటని దుకాణదారుడు తేల్చారు. ఇలాంటి ఘటనలు పట్టణంలో అనేకం జరిగాయని, వంద నోటే కదా అని తిరిగి బ్యాంకుకెళ్లి ఫిర్యాదు చేయడం లేదు.

బ్యాంకుల్లోనే కాదు ఏటీఎంలలో కూడా నకిలీ నోట్లు వస్తున్నాయని ప్రజలు లబోదిబోమంటున్నారు. ఇక రూ.10 నాణేల విషయానికొస్తే ఎక్కడా చెలామణి కావడం లేదు. చిల్లర దుకాణ దారుల వద్ద వందల్లో నాణేలున్నాయి. వీటిని దేవుడి హుండీలో వేసినప్పటికీ ఆలయ పెద్దలు మూట కట్టి మూలన పడేస్తున్నారు. గతంలో నకిలీ నాణేలను అధికారులు గుర్తించడంతో పది రూపాయల నాణేనికి మనుగడ లేకుండా పోయింది. నిజమైన నాణేలు ఉన్న ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారు. అధికారులు నకిలీ కరెన్సీని సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై ఏపీజీబీ ఆర్‌ఎంను న్యూస్‌టుడే వివరణ కోరగా దొంగనోట్లు వచ్చేదానికి అవకాశం లేదని, తాను గోపవరం బ్యాంకు మేనేజరు కృష్ణవేణితో మాట్లాడి తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించారు.

ఇదీ చదవండి: నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన సబ్​కలెక్టర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.