ETV Bharat / state

జమ్మలమడుగులో వైకాపా నేతల మధ్య భేదాలు - జమ్మలమడుగు తాజా వార్తలు

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో.. వైకాపా ముఖ్యనేతల మధ్య సఖ్యత కరవైంది. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీమంత్రి రామసుబ్బారెడ్డి.. ఏడాది నుంచి ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. వీరి మధ్య సయోధ్య కుదర్చడానికి ముఖ్యమంత్రి జగనే రంగంలోకి దిగారు. తనను కలిసిన.. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. అదే సమయంలో వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ సుధీర్ రెడ్డికేనని ముఖ్యమంత్రి ప్రకటించడం చర్చనీయాంశమైంది.

వైకాపా నేతల మధ్య భేదాలు
వైకాపా నేతల మధ్య భేదాలు
author img

By

Published : Apr 10, 2021, 7:25 AM IST

వైకాపా నేతల మధ్య భేదాలు

కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని వైకాపా ముఖ్యనేతల మధ్య ఏడాది నుంచి అంతర్గత విబేధాలు కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో జమ్మలమడుగు నుంచి వైకాపా తరపున సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. ఈ నియోజకవర్గంలో దశాబ్దాల తరబడి మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి.... లేకుంటే మాజీమంత్రి రామసుబ్బారెడ్డి కుటుంబ సభ్యులే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచే ఒకరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేసినా వైకాపాను ఓడించలేక పోయారు. వైకాపా తరపున సుధీర్ రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుపొందారు. తర్వాత జరిగిన పరిణామాల మధ్య మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి భాజపాలో చేరగా... రామసుబ్బారెడ్డి వైకాపా గూటికి చేరారు. వైకాపా లో చేరినప్పటికీ అయనకు సముచిత స్థానం లభించలేదనే విమర్శలు ఉన్నాయి.

పార్టీలో నామమాత్రంగా కొనసాగుతున్న రామసుబ్బారెడ్డి..

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామ సుబ్బారెడ్డికి అసలు సఖ్యతే లేదు. ఇరువురికి గ్రామాల్లో రెండు వర్గాలు ఉన్నాయి. గండికోట ముంపు పరిహారం విషయంలో ప్రశ్నించారనే కారణంతో పి.అనంతపురంలో రామసుబ్బారెడ్డి అనుచరుడు గురుప్రతాప్ రెడ్డిని వైకాపా అనుచరులు హత్య చేశారు. ఆ కుటుంబాన్ని రామసుబ్బారెడ్డి పరామర్శించినా.. సుధీర్ రెడ్డి వెళ్లలేదు. ఈ విధంగా నియోజకవర్గంలో పనులన్నీ సుధీర్ రెడ్డి చెప్పిన వారికే దక్కు తున్నాయి. రామసుబ్బారెడ్డి నామమాత్రంగానే పార్టీలో కొనసాగుతున్నారు.

సజ్జల జోక్యం..

రెండు నెలల కిందట వైకాపా నేత సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇరువురు నేతలతో వేర్వేరుగా సమావేశమైనా సయోధ్య మాత్రం కుదరలేదు. ఈ నేపథ్యంలో.. శుక్రవారం ముఖ్యమంత్రిని... సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి సమక్షంలో రామసుబ్బారెడ్డి కలిశారు. నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి ఇద్దరూ కలిసి పనిచేయాలని ఆయనకు సీఎం సూచించారు. కానీ వచ్చే ఎన్నికల్లో మళ్లీ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్ సుధీర్ రెడ్డికే ఇస్తున్నట్లు జగన్ ప్రకటించారని... రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని సజ్జల రామకృష్ణారెడ్డి వెల్లడించారు.

ఇదీ చదవండి:

రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ హామీ ఇచ్చారు: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.