కడప జిల్లా బి.కోడూరు మండలం సిద్దుగారిపల్లి గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి శ్రీనివాస్ రెడ్డి.. ఆత్మహత్య చేసుకున్నాడు. నిన్న కళాశాల నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి ఉదయానికల్లా ఉరి వేసుకుని మరణించాడు. కాలేజీలో పెట్టే ఒత్తిడి తట్టుకోలేకే ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. అతని చేతి మీద కూడా ఈ విషయాన్ని రాసుకున్నాడు.
గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి - ప్రమీలమ్మ దంపతుల చివరి సంతానం శ్రీనివాస్ రెడ్డి. జిల్లాలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడని మృతుని తల్లిదండ్రులు తెలిపారు. 'అమ్మానాన్న నన్ను క్షమించండి. కుటుంబసభ్యులను మిస్సవుతున్నాను' అంటూ శ్రీనివాస్ రెడ్డి రాసిన లేఖ.. వారిని ఆవేదనకు గురిచేస్తోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న తమ కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంపై కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీ చదవండి: