ETV Bharat / state

కడప రిమ్స్​లో 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభం - కడప రిమ్స్​లో 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభం

కడప జిల్లాలో కోవిడ్ రోగుల కోసం రిమ్స్​లో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్​ ప్రారంభమైంది. ఐసీయులో ఏదైనా కేసు సీరియస్ అయితే వెంటిలేటర్ కలిగిన ఈ స్టెప్ అప్ ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తారన్నారని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అవినాశ్ రెడ్డి, చీఫా విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

intensive care unit opened in kadapa rims
కడప రిమ్స్​లో 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ప్రారంభం
author img

By

Published : Jul 31, 2020, 11:34 AM IST

కడప జిల్లాలో కోవిడ్ రోగుల కోసం రిమ్స్​లో అధునాతన సౌకర్యాలతో ఏర్పాటు చేసిన 10 పడకల ఇంటెన్సివ్ కేర్ యూనిట్​ను గురువారం ప్రభుత్వం చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, కలెక్టర్ హరికిరణ్ ప్రారంభించారు. రిమ్స్​లో రెగ్యులర్ కొవిడ్, నాన్ కోవిడ్ వింగ్ పేషంట్లకు 300 పడకలు కేటాయించారని, వాటికి అదనంగా ఈ స్టెప్ అప్ ఐసీయూ యూనిట్​ను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఇందులో అటాచ్డ్ బాత్ రూమ్, ఏసీ, అధునాతన వెంటిలేటర్ సౌకర్యం ఉందని, 20 రోజుల రికార్డు సమయంలో ఈ స్టెప్ అప్ ఐసీయూ యూనిట్​ను జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిందన్నారు.

ఐసీయులో ఏదైనా కేసు సీరియస్ అయితే వెంటిలేటర్ కలిగిన ఈ స్టెప్ అప్ ఐసీయూకి తరలించి చికిత్స అందిస్తారన్నారు. స్టేట్ కొవిడ్ ఆసుపత్రి, జిల్లా కొవిడ్ ఆసుపత్రి మధ్యలో ఈ ఐసీయూ వారధిగా ఉపయోగపడుతుందన్నారు. కరోనా కేసుల విషయంలో 99 శాతం ప్రభుత్వమే భారం మోస్తోందని.. ప్రొద్దుటూరు, పులివెందులలో ఆసుపత్రులు సిద్ధం అయ్యాయని తెలిపారు. 4 దశలలో కొవిడ్ పేషంట్లకు జిల్లాలో చికిత్స అందిస్తున్నారని ఎంపీ అవినాశ్ రెడ్డి అన్నారు. ఎలాంటి లక్షణాలు లేని వారిని హోమ్ ఐసోలేషన్​కు ప్రభుత్వం అనుమతించిందని, వారికి తగిన విధంగా సూచనలు, సలహాలు ఇచ్చి పర్యవేక్షణ చేయడం జరుగుతోందన్నారు.

ఇవీ చదవండి..

కరోనా భయమో.. అవమానం అని అనుకున్నాడో.. ప్రాణమే తీసుకున్నాడు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.