అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ ఉంచిన గోదాంపై కడప విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో 75 లక్షలు విలువ చేసే ఐదు వేల బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జిల్లాలో ఈ స్థాయిలో చౌక దుకాణం బియ్యం పట్టుకోవడం ఇదే మొదటిసారి. ఇటీవల కాలంలో చౌక దుకాణం బియ్యం అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం రావడంతో.. విజిలెన్స్ అధికారులు నిఘా ఉంచారు. ఈ మేరకు నగరు శివారులోని గోదాముల్లో దాడులు చేశారు. కాగా యజమాని నారాయణ రెడ్డి కోసం గాలిస్తున్నారు. చౌక దుకాణ బియ్యాన్ని ఎవరు సరఫరా చేశారు.. ఎక్కడి నుంచి తీసుకువచ్చారు.. ఎవరు విక్రయించారనే కోణాల్లో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి...