ETV Bharat / state

viveka murder case: వివేకా కేసు.. అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు - కడప జైలు అతిథిగృహం

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వై.ఎస్.వివేకా హత్య కేసులో సీబీఐ అధికారుల విచారణ 70వ రోజుకు చేరింది. కడప జైలు అతిథిగృహంలో నలుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

వివేకా కేసు.. అనుమానితులను ప్రశ్నిస్తున్న అధికారులు

author img

By

Published : Aug 15, 2021, 12:22 PM IST

వైఎస్ వివేకా హత్య కేసులో 70వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప, పులివెందులలో అనుమానితులను సీబీఐ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కడప జైలు అతిథి గృహంలో నలుగురు అనుమానితులను విచారిస్తున్నారు. ఈ విచారణకు జగదీశ్వర్‌రెడ్డి, భరత్‌కుమార్, గంగిరెడ్డి ఆస్పత్రి సిబ్బంది హాజరయ్యారు. పులివెందులలో ఉదయ్‌కుమార్‌రెడ్డి తల్లిని, కడపలో ఉమాశంకర్ రెడ్డిలను అధికారులు ప్రశ్నిస్తున్నారు.

పులివెందులలోని తమ ఇంటివద్ద ఈ నెల 10వ తేదీన రెక్కీ నిర్వహించారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. డీఎస్పీ శ్రీనివాసులు మణికంఠను ప్రశ్నించారు. వివేకా ఇంటి ప్రాంతంలో బైకుపై రెండుసార్లు ఎందుకు తిరగాల్సి వచ్చింది, కాంపౌండ్‌లోకి వెళ్లడానికి కారణమేంటనే అంశాలు ఆరా తీశారు. అద్దె గదుల కోసం వెదుకుతూ అక్కడి వెళ్లినట్లు చెప్పగా.. వివేకా ఇంటి ప్రాంగణంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని డీఎస్పీ ప్రశ్నించారు. దీనిపై మణికంఠరెడ్డి సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు.. బైండోవర్ కేసు నమోదు చేశారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయానికి తీసుకెళ్లి, ఆర్డీవో శ్రీనివాసులు సమక్షంలో బైండోవర్ చేయించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. భద్రత కల్పించాలన్న సునీత విజ్ఞప్తి మేరకు.. వివేకా ఇంటి వద్ద పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.

అనుబంధ కథనం

SP Reaction: వివేకా కుమార్తె లేఖకు ఎస్పీ స్పందన.. సునీత ఇంటి వద్ద పికెట్ ఏర్పాటు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.