కడప జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగింది. బద్వేలు నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళలు సంఖ్యాపరంగా తక్కువగా ఉన్నప్పటికీ ఓటు విషయంలో మహిళలే ఆసక్తి ఎక్కువ చూపారు. నియోజకవర్గంలో 2లక్షల 4వేల 18 మంది ఓటర్లున్నారు. వీరిలో లక్షా 58వేల 864 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం నియోజకవర్గంలో 77.64 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇది 74 శాతంగా ఉంది. మహిళా ఓటర్ల విషయానికి వస్తే లక్షా 17వందల 86 మందికి గాను 81వేల 394 మంది ఓటు వినియోగించుకున్నారు. పురుష ఓటర్ల విషయానికొస్తే లక్షా 2వేల 811 మందికిగాను 77వేల 466 మంది ఓటు హక్కు వినియోగించుకుని 75. 35 శాతానికి పరిమితమయ్యారు.
- మొత్తం ఓటర్ల సంఖ్య- 2,04, 618
- ఓటు హక్కు వినియోగించుకున్నవారు- 1,58,8 64
- ఓటింగ్ శాతం-77.64( గత ఎన్నికల్లో 74శాతం)
- మహిళా ఓటర్ల సంఖ్య-1,01,786
- ఓటు హక్కు వినియోగించుకున్న వారు- 81,394
- ఓటింగ్ శాతం- 79.97
- పురుష ఓటర్ల సంఖ్య- 1,02,811
- ఓటు హక్కు వినియోగించుకున్న వారు-77,466
- ఓటింగ్ శాతం- 75.35
ఇవీ చూడండి- 2014తో పోల్చుకుంటే..పోలింగ్ ఎంత పెరిగిందో తెలుసా!