అన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నా కడప జిల్లాలోని కేసీ కాలువ ఆయకట్టు రైతాంగానికి కష్టాలు తప్పటం లేదు. సాగునీటి కోసం నాలుగు రోజుల కిందట నీరు విడుదల చేసినా.. కాలువలో నీటిమట్టం పెరగకపోవటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఉన్న నీళ్లు సాగుకు సరిపోక నానా కష్టాలు పడుతున్నారు. పోతిరెడ్డిపాడు నుంచి కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసినా.. మైదుకూరు వద్ద రెండున్నర అడుగుల మేర మాత్రమే నీరు పారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలువలో నీటిమట్టం పెరిగితే కానీ నారుమళ్లు వేసుకునే పరిస్థితి లేదంటున్నారు. అధికారులు దీనిపై దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.
కాలువలో నీటిమట్టం పెంచండి..సాగుకు సహకరించండి
వర్షాకాలం మొదలై నెలలు గడుస్తున్నా ఇంకా వర్షాలు కురవటం లేదు. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురిసి దిగువకు నీళ్లు విడుదల చేస్తున్నా.. అవి కొన్ని ప్రాంతాలకు చేరటం లేదు. కేసీ కెనాల్‌కు నీరు విడుదల చేసినా.. కాలువలో నీటిమట్టం ఎక్కువ లేకపోవటంతో అవి చివరి ఆయకట్టుకు అందక రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.