ETV Bharat / state

ఆపత్కాలంలో ఆపద్బాంధవులు - lockdown

కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం లాక్​డౌన్ విధించింది. ఫలితంగా ఉపాధి లేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు. కడప జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో రోజువారి కూలీలు, నిరుపేదలు భోజనాలకు సైతం ఇబ్బందులు పడుతున్నారు. వీరి అవస్థను గమనించిన స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు భోజనం, నిత్యావసర సరకులు పంపిణీ చేస్తూ ఉదారతను చాటుకుంటున్నారు.

In Kadapa district, the needy and the needy are the donors and the NGOs
కడప జిల్లాలో పేదలకు నిత్యావసరాలు, భోజనం పంపిణీ చేస్తున్న దాతలు, స్వచ్చంధ సంస్థలు
author img

By

Published : Apr 13, 2020, 5:00 PM IST

రైల్వే కోడూరు మండలం రెడ్డివారిపల్లిలోని గిరిజన గ్రామంలో జనసేన పార్టీ నాయకుడు నాగేంద్ర ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. అనంతరం సామాజిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేసి అన్నదానం చేశారు. స్థానిక తహశీల్దార్ పేదలకు నిత్యావసర సరకులు పంపిణీ చేశారు. ఓబులవారిపల్లిలో స్థానిక వైకాపా నాయకులు నిత్యావసర సరకులు పంపిణీ చేయగా.. రైల్వే కోడూరులో వైకాపా నేతలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వీరితో పాటు స్వచ్ఛంద సంస్థలు, యువత.. అన్నదాన కార్యక్రమాలతో పాటు వాటర్ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.

ఇదీచదవండి.

స్వస్థలాల నుంచి సిబ్బందిని వెనక్కి తీసుకొస్తున్న ఫార్మా కంపెనీలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.