కడప నగరంలో అక్రమ కట్టడాలు, లే అవుట్లు చేస్తున్నప్పటికీ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని.. భాజపా జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. కడపలో మాట్లాడుతూ.. అధికార పార్టీ నాయకులకు అధికారులు వత్తాసు పలుకుతూ వారు చేసే అవినీతి పనులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. నగరంలోని బుద్ధ టౌన్షిప్లో 10 ఎకరాల స్థలం కబ్జాచేశారన్నారు. చివరకు శ్మశాన స్థలాన్ని వదల్లేదని విమర్శించారు. పురపాలక కమిషనర్ ఈ అక్రమాలన్నింటికి దాచిపెడుతున్నారని ధ్వజమెత్తారు.
ఇవీ చదవండి... : అనగనగా ఓ గుట్ట.. ఆ గుట్ట గండెల్లో గుణపం