ETV Bharat / state

కడపను వణికిస్తున్న తుపాను - ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు - Cyclone Michaung situation in AP

Impact of Cyclone Michaung in Kadapa District : వైయస్ఆర్ జిల్లాపై మిగ్‌జాం తుపాను ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మంగళ, బుధవారాల్లో తుపాను తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. తుపాను ప్రభావంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది.

Impact_of_Cyclone_Michaung_in_Kadapa_District

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 5, 2023, 4:03 PM IST

కడపను వణికిస్తున్న మిగ్​జాం తుపాను - ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు సెలవులు

Impact of Cyclone Michaung in Kadapa District : తుపాను ప్రభావంతో ఉమ్మడి కడప జిల్లాలో పలు మండలాల్లో భారీ వర్షం కురిసింది. ప్రధానంగా ఒంటిమిట్ట, రాజంపేట, నందలూరు, రైల్వే కోడూరు, సుండుపల్లె మండలాల్లో భారీ వర్షపాతం నమోదైంది. ఒంటిమిట్ట మండలంలో అత్యధికంగా 14 సెంటీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షానికి మండలంలోని వందల ఎకరాల్లో అరటి తోటలు దెబ్బతిన్నాయి. ఒంటిమిట్ట, రాజంపేట మండలాల్లోని అరటి తోటలన్నీ గాలి, వానకు నేలవాలాయి. సుండుపల్లి మండలంలో పించా నదికి భారీగా వరద పోటెత్తుతుంది.

ఉత్తర దిశగా కదులుతున్న తీవ్రతుపాను - కొంతభాగం సముద్రంలో ఉన్నట్లు ఐఎండీ వెల్లడి

Farmers Worries Due to Cyclone Michaung : ఎగువ ప్రాంతంలో నుంచి వరద రావడం వల్ల పించా నదిలోకి పెద్ద ఎత్తున వర్షపు నీరు చేరుతుంది. దీంతో దిగువ ప్రాంతానికి అధికారులు నీటిని విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలను కూడా అప్రమత్తం చేశారు. కడప, ప్రొద్దుటూరు, పులివెందుల ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది. సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద పెద్ద చెట్టు విరిగిపడి అటువైపు వెళుతున్న బెటాలియన్ కానిస్టేబుల్ సత్యకుమార్ ద్విచక్ర వాహనంపై పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. కానిస్టేబుల్ మృతదేహాన్ని కడప రిమ్స్ కి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. తుపాను ప్రభావంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు జిల్లా యంత్రాంగం సెలవులు ప్రకటించింది.

రాష్ట్రంలో తుపాను - పలు జిల్లాల్లో విద్యా సంస్థలకు రేపు, ఎల్లుండి సెలవులు

Cyclone Michaung LIVE Updates : అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాలపై మిగ్‌జాం తుపాను ప్రభావం క్రమంగా పెరుగుతోంది. మంగళ, బుధవారాల్లో (నేడు, రేపు) తుపాను తీవ్రత అది కంగా ఉండే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు, రాజంపేట, పీలేరు నియోజకవర్గాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా, వైయస్ఆర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం నుంచి చిరుజల్లులు కురుస్తున్నాయి. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలతో పలుచోట్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలంలో 50.6 మిల్లీమీటర్ల అత్యధిక వర్ష పాతం నమోదు కాగా, చిట్వేలిలో 19.4, ఓబులవారిపల్లెలో 14.8, చిన్నమండెంలో 19.6, కంభంవారిపల్లెలో 12.8, కలికిరిలో 13. 4, వాల్మీకిపు రంలో 11.0, పీలేరు మండలంలో 10 మిల్లీమీటర్లచొప్పున వర్షపాతం నమోదైంది.

LIVE UPDATES: తీర ప్రాంతం జిల్లాల్లో రెడ్ అలెర్ట్ - రాష్ట్రంపై తీవ్ర ప్రభావం

Cyclone Michaung Latest News : తిరుపతి జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరు, చిట్వేలి, పెనగలూరు మండలాల్లోని గుంజనేరు ఉదృతంగా ప్రవహిస్తుండగా, చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. రైల్వేకోడూరు మండలం రెడ్డి వారిపల్లె పంచాయతీలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇక్కడ వంతెన నిర్మాణానికి పాత వంతెనను కూల్చివేసి ప్రత్యామ్నాయంగా నిర్మించిన తాత్కాలిక రహదారి వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. దీంతో రైతులు తమ పంటలను పట్టణాలకు తరలించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈదురు గాలులతో అరటి, బొప్పాయి తోటలు నేల కొరిగాయి.

Impact of Cyclone Michaung in AP : మరో రెండు రోజులపాటు వర్షాలు కొనసాగే పక్షంలో మరింత నష్టం వాటిల్లుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రాజంపేట మండలం ఆకేపాడు, హస్తవరం, పోలి, బ్రాహ్మణపల్లి, కొల్లా వారిపల్లి, మిట్టమీదపల్లి, శేషమాంబపురం గ్రామాల్లో అరటి తోటలు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. చిట్వేలి ప్రధాన రహదారిలో భారీ వృక్షం నేలకొరగగా, రైల్వేకోడూరు మండలం లోని కుక్కలదొడ్డి వద్ద కొండపై నుంచి వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. కడప నగరంలోని రహదారులన్నీ జలమయం కావడంతో రాకపోకలకు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

LIVE UPDATES: మరో 24 గంటల్లో రాష్ట్రంలో చాలా చోట్ల వర్షాలు - తీరం దాటినా తుపాను ప్రభావం

కంట్రోల్​రూం​ల ఏర్పాటు

అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాల్లో కలెక్టర్లు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. పరిస్థితిని సమీక్షిస్తూ ఆదుకోవడానికి నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు ప్రకటించారు. అన్నమయ్య కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటు చేసి 08561-233006 నంబరును అందుబాటులోకి తెచ్చారు. వైయస్ఆర్ జిల్లాకు సంబందించి కలెక్టర్ కార్యాలయంలో 08562-21644 ఫోన్ నంబరుతో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.

విద్యాలయాలకు సెలవు

అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లోని పాఠశాలలకు మంగళవారం కలెక్టర్లు గిరీష, విజయరామరాజు సెలవు ప్రకటించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలను మూసివేయాలని ఆదేశించారు, ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అన్నమయ్య జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రధానంగా రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు నియోజకవర్గాలపై తుపాను ప్రభావం తీవ్రంగా ఉంటుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ గిరీష పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.