కడపకు చెందిన యువకులు స్థానిక భగత్‌సింగ్ నగర్లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 50 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉదయం 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంచుతారు. తరువాత మూసి వేస్తారు. ఆ తరువాత వీరు ఒక్కో సీసాపై 100 రూపాయలు ఎక్కువకు విక్రయిస్తున్నారు. ఎవరైనా అక్రమంగా మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవీ చదవండి
రాజంపేటలో భవన నిర్మాణ కార్మికుల ఆందోళన