కడప జిల్లా ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పెద్ద ఎత్తున అక్రమ మద్యం, గుట్కాను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సుధాకర్ తెలిపారు. కొర్రపాడు రోడ్డులోని డెకరేషన్ గోడౌన్ లో అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో తనిఖీ చేసి పట్టుకున్నామని వివరించారు. సుమారు రూ. 6లక్షల విలువచేసే మద్యం, రూ.3 లక్షల విలువచేసే గుట్కా స్వాధీనం చేసుకున్నామని అన్నారు. శివరామిరెడ్డి, నారాయణలను అరెస్టు చేసిన్నట్లు వెల్లడించారు. మద్యం, గుట్కా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ సుధాకర్ హెచ్చరించారు.
ఇదీ చదవండి అద్దె బస్సుల్లో డీజిల్ అపహరించిన ఇద్దరు అరెస్ట్