కడప జిల్లా అనంతయ్యగారిపల్లె సమీపంలోని మామిడి తోటలో కాపలా ఉంటున్న గిరిజన దంపతుల మధ్య.. మద్యం చిచ్చు పెట్టింది. నిన్న ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరవగా.. మళ్లీ తాగడం మొదలుపెట్టిన భర్త సురేష్... తను ఫోన్ చేస్తే ఎత్తలేదనే కారణంతో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు.
తలపైన బలమైన గాయం కావటంతో కుటుంబసభ్యులు బాధితురాలిని రాజంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స చేయించారు. నిన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు చేసింది.
ఇదీ చూడండి: