కరోనా కట్టడికి కృషి చేస్తున్న వారిలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర ఎంతో కీలకమని తెదేపా నాయకులు గోవర్ధన్ రెడ్డి అన్నారు. వారి సేవలను కొనియాడుతూ కడపలో 30 మంది సఫాయి కార్మికులను ఆయన సన్మానించారు. ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు ప్రోత్సాహక నగదును అందజేశారు. మహిళా కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో ఉచితంగా నిత్యావసర వస్తువులను పంపిణీ చేస్తామని చెప్పారు.
ఇదీ చదవండి: