కడప జిల్లాలో వచ్చే రెండు రోజుల్లో 40 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని జిల్లా కలెక్టర్ సి.హరి కిరణ్ ఒక ప్రకటనలో తెలిపారు. వాతావరణ శాఖ నుంచి జిల్లాకు సూచనలు అందినట్లు పేర్కొన్నారు. లాక్ డౌన్ వేళ ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు ఆయన సూచించారు.
అధిక ఉష్ణోగ్రతల వల్ల జ్వరాలు వచ్చే అవకాశం ఉండటంతో చల్లని త్రాగునీరు, పానీయాలు తగినంతగా తీసుకోవాలన్నారు. పలచని వస్త్రాలు ధరించాలని, అత్యవసర వైద్య సేవలకు వచ్చే వారు కూడా ఎండ నుంచి తగిన రక్షణ పొందేలా తలపై టోపీ, గొడుగు లేదా వస్త్రం లాంటివి ధరించాలని సూచించారు.
అత్యవసరమైతే ప్రభుత్వం సూచించిన మేరకు వైఎస్ఆర్ టెలీ మెడిసిన్ వైద్యసేవల టోల్ ఫ్రీ నెంబర్ 14410 కు లేదా టెలీ కన్సల్టెన్సీ కోసం 08562 - 244437, 08562-244070 లకు ఫోన్ చేయాలని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: