ETV Bharat / state

14 పంచాయతీల్లో ఎన్నికలకు బ్రేక్!

కడప జిల్లాలో తొలి విడత గ్రామపంచాయతీల ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా.. రెండు, మూడు విడతల్లో ఎన్నికలు జరిగే కొన్ని గ్రామపంచాయతీలకు బ్రేకు పడింది. జిల్లాలోని 13 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిలుపుదల చేయాలని స్థానికులు, కొందరు రాజకీయ నాయకులు హైకోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఫలితంగా 13 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు నిలుపుదల చేస్తున్నట్లు హైకోర్టు ఉత్తర్వులు ఇవ్వగా, గతేడాది నుంచి ఓ గ్రామపంచాయతీపై స్టే కొనసాగుతోంది. దీంతో జిల్లాలో మొత్తం 14 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. కాగా గతంలో జరగని రాజంపేట మండలంలోని అయిదు పంచాయతీలకు ఈసారి ఎన్నికలు నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.

high court break
high court break
author img

By

Published : Jan 30, 2021, 10:41 AM IST

కడప జిల్లాలో 2019 వరకు 790 పంచాయతీలు ఉన్నాయి. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం గతేడాది ప్రారంభంలో పంచాయతీల విభజన, విలీన ప్రక్రియ చేపట్టింది. జనాభా ప్రాతిపదికన పెద్ద పంచాయతీలను విభజించి రెండు, మూడు పంచాయతీలు చేయడం, చిన్నచిన్న పంచాయతీలను కలిపేయడం వంటి చర్యలు చేపట్టింది. కొన్నిచోట్ల గ్రామస్థులకు ఇష్టం లేకపోయినా ఈ ప్రక్రియ కొనసాగింది. ఈ లెక్కన జిల్లాలో గ్రామపంచాయతీల సంఖ్య గతేడాది ఫిబ్రవరి-మార్చిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం 807కు చేరింది.

కరోనా నేపథ్యంలో గ్రామపంచాయతీ ఎన్నికలు జరగ లేదు. ప్రస్తుతం జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు శుక్రవారం నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇదే సమయంలో రెండు, మూడు విడతలో నిర్వహించాల్సిన గ్రామ పంచాయతీ ఎన్నికలపై కొందరు స్థానికులు, రాజకీయ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జిల్లాలో 13 పంచాయతీల్లో ఎన్నికలు నిలుపుదల చేస్తూ హైకోర్టు స్టే ఇచ్చింది.

● రైల్వేకోడూరు మండలంలో రెడ్డివారిపల్లె పంచాయతీని విభజించి గుండాలపల్లె పంచాయతీని ఏర్పాటు చేశారు.

● సంబేపల్లి మండలంలోని శెట్టిపల్లె పంచాయతీని విభజించి శెట్టిపల్లి, అడవికాంపల్లి, చదిపిరాళ్లవాండ్లపల్లె పంచాయతీలు చేశారు. ఎస్టీ జనాభా అనుగుణంగా పెద్దబిడికిని మరో పంచాయతీ చేశారు. పెద్దబిడికి మినహా మిగిలిన మూడు పంచాయతీలు కలిసే ఉండాలనే ఉద్దేశంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు.

● కమలాపురం మండలంలోని సి.గోపులాపురం పంచాయతీ ఎన్నికలపై స్టే వచ్చింది. కమలాపురం నగర పంచాయతీ చేసే సమయంలో సి.గోపులాపురం పంచాయతీ పరిధిలోని నీరాపురం గ్రామాన్ని కమలా పురం నగర పంచాయతీలో కలిపారు. దీన్ని వ్యతిరేకిస్తూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు.

● వల్లూరు మండలం పెద్దపుత్త, మాచిరెడ్డిపల్లె పంచాయతీల ఎన్నికలకు బ్రేకు పడింది. పెద్దపుత్త నుంచి మాచిరెడ్డిపల్లెను విభజించడంతో కలిసే ఉండాలనే ఉద్దేశాన్ని స్థానికులు కోర్టుకు విన్నవించారు.

●పుల్లంపేట మండలంలోని బావికాడపల్లి, రామాపురం పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఇక్కడ కూడా విభజనకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

● నందలూరు మండలం నూకినేనిపల్లి పంచాయతీలో ఎన్నికలు నిలుపుదల చేశారు. గతంలో కుందానెల్లూరు పంచాయతీని నూకినేనిపల్లిలో విలీనం చేయడంతో స్థానికులు విలీనాన్ని వ్యతిరేకిస్తూ కోర్టు మెట్లెక్కారు.

● సుండుపల్లి మండలంలోని సుండుపల్లి, ఈడిగెపల్లి పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. సుండుపల్లి నుంచి ఈడిగెపల్లెను విభజించి పంచాయతీలుగా ఏర్పాటు చేయడంతో విభజన అశాస్త్రీయంగా ఉందనే కారణంతో స్థానికులు కోర్టును ఆశ్రయించారు. ఇదే మండలంలోని సొంటంవారిపల్లె పంచాయతీకి గత ఏడాదిలోనే హైకోర్టు స్టే ఇచ్చింది. దీంతో మొత్తం జిల్లాలో 14 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. 807 పంచాయతీల్లో హైకోర్టు స్టే మినహాయిస్తే ప్రస్తుతం 793 పంచాయతీలకు మాత్రమే నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతాయని జిల్లా పంచాయతీ అధికారులు చెబుతున్నారు.

అయిదింటిపై సందిగ్ధత...

రాజంపేట మండలంలోని అయిదు గ్రామపంచాయతీలపై సందిగ్ధత కొనసాగుతోంది. కూచివారిపల్లె, బోయనపల్లె, ఎం.జి.పురం, తాళ్లపాక, పెద్దకారంపల్లి గ్రామపంచాయతీలను రాజంపేట పురపాలక సంఘంలో విలీనం చేయాలనే ప్రక్రియతో 2013 నుంచి ఎన్నికలు జరగలేదు. స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పంచాయతీలతోపాటు పురపాలక సంఘానికి ఎన్నికలు నిలిచిపోయాయి. ప్రస్తుతం ఈ అయిదు పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేందుకు పంచాయతీ అధికారులు సిద్ధమవుతున్నారు.

అవి మినహా మిగిలిన వాటికి ఎన్నికలు...

జిల్లాలో మొత్తం 14 పంచాయతీల్లో ఎన్నికలు నిలుపుదల చేయాలని హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. ఆయా పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికలు నిలుపుదల చేసి మిగిలిన వాటికి యధాప్రకారం ఎన్నికలు నిర్వహిస్తాం. రాజంపేట మండలంలో నిలిచిపోయిన అయిదు గ్రామపంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహిస్తాం. - ప్రభాకర్‌రెడ్డి, డీపీవో, కడప

ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మొత్తం 18 కేంద్రాల్లో నామినేషన్లు జరిగాయి. ప్రొద్దుటూరు మండలంలో 10, రాజుపాలెంలో 8 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించారు. ప్రొద్దుటూరులో 6 నామినేషన్లు సర్పంచ్లకు దాఖలు కాగా.. 32 నామినేన్లు వార్డు మెంబర్ల స్థానాలకు అభ్యర్థులు నామ పత్రాలు అధికారులకు సమర్పించారు. రాజుపాలెంలో 10 సర్పంచులు, రెండు వార్డు మెంబర్ల నామినేషన్లు దాఖలయ్యాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్ ప్రసాదరావు, సీఐ విశ్వనాథ్ రెడ్డిలు నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.

ఇదీ చదవండి:

చెల్లి చచ్చిపోతానంటే అక్క సరే అంది.. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.