ETV Bharat / state

భారీ వర్షాలతో నిండిన కుంటలు, చెరువులు - lakes

నిత్యం కరవు కాటకాలతో తల్లడిల్లే కడప జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాతలో వాగులు వంకలు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి.

భారీ వర్షాలు
author img

By

Published : Sep 20, 2019, 11:32 PM IST

భారీ వర్షాలతో నిండుతున్న కుంటలు, చెరువులు

కడప జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నదులు, వాగులు, వంకలు పొంగుతున్నాయి. చెరువులు, కుంటలకు భారీగా నీరు చేరి.. అలుగులు పారటంతో రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు. గురువారం రాత్రి జిల్లాలోని సంబేపల్లి మండలంలో అత్యధికంగా 117. 5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. పెన్నా, కుందు, పాపాగ్ని, బాహుదా, మాండవ్య నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గండికోట, మైలవరం ప్రాజెక్టులు నిండిపోవటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో వరద నీటితో పంటలు మునిగిపోయాయి. అధికారులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి.

సార్..! పొంచిఉన్న ప్రమాదాన్ని గుర్తించండి

Intro:ap_cdp_16_20_rto_acb_dhadulu_avb_ap10040
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.

యాంకర్:
కడప రవాణా శాఖ కార్యాలయంపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 14 మంది ఏజెంట్లు అదుపులోకి తీసుకొని వారి నుంచి 86 వేల రూపాయల నగదు స్వాధీనపరుచుకున్నారు. సిబ్బంది వద్ద మూడు వేల రూపాయల అనధికారిక నగదును జప్తు చేసినట్లు ఏసీబీ డీఎస్పీ నాగభూషణం తెలిపారు. రవాణా శాఖలో దళారీ వ్యవస్థ లేనప్పటికీ కొంతమంది సిబ్బంది దళారులను ఏర్పాటు చేసుకొని వాహనదారుల నుంచి అధికంగా డబ్బులు వసూలుచేసి సిబ్బందికి ఇచ్చేవారు. ఇలా 14మంది దళారీలు రవాణా శాఖ కార్యాలయానికి వచ్చే వాహనదారుల నుంచి అధిక మొత్తంలో డబ్బులు వసూలు చేసేవారు. విషయం అవినీతి నిరోధక శాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో వారు పకడ్బందీగా ఆకస్మిక దాడులు చేసి 14 మంది ఏజెంట్లు అదుపులోకి తీసుకొని వారి నుంచి నగదును స్వాధీనపరుచుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని డీఎస్పీ చెప్పారు.
byte: నాగభూషణం, ఎసిబి డిఎస్పీ, కడప.

Body:ఏసీబీ దాడులు

Conclusion:కడప
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.