కడప జిల్లా బద్వేల్ మండలం ఆనంద్‌నగర్, వెంకటాద్రినగర్ గ్రామాల సమీపంలోని ఓ చెరువు అలుగు పారితే చాలు నీరంతా ఇళ్లలోకి వచ్చి చేరుతుంది. అలుగు పారినప్పుడల్లా ఇదే పరిస్థితి నెలకొంటుంది. దీంతో అక్కడి ప్రజలు తట్టా బుట్టా సర్ధుకుని ఎగువ ప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి. దీనిపై అనేక పర్యాయాలు అధికారులకు తెలిపినప్పటికి వారు పరిస్థితిని చక్కదిద్దలేదు. ఆ రెండు గ్రామాల ప్రజలు ముంపు నీటితో దినదినగండంగా జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. అధికారులు స్పందించి పరిస్థితిని చక్కదిద్దాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి