ETV Bharat / state

రాయచోటిలో భారీ వర్షం.. పొంగిపొర్లుతున్న జలవనరులు - కడప జిల్లా

కరవు నేలను వరుణుడు కరుణించాడు. వర్షాలు లేక ఐదేళ్లుగా వేడెక్కిన కడప జిల్లాలో... ఖరీఫ్ ప్రారంభ దశలోనే వర్షాలు కురవడం.. రైతుల్లో ఆనందం నింపింది.

kadapa district
రాయచోటిలో భారీ వర్షం.. పొంగిపొర్లతున్న జలవనరులు
author img

By

Published : Jun 30, 2020, 10:15 PM IST

కడప జిల్లాలోనే అత్యంత కరవు ప్రాంతమైన రాయచోటి నియోజకవర్గంలో సోమవారం రాత్రి కుంభవృష్టి కురిసింది. ఏకధాటిగా కురుసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని ప్రాజెక్టులు జలకళ సంతరించుకున్నాయి. రాయచోటికి వరప్రసాదినిగా ఉన్న మాండవ్య నది... వరద నీటితో పొంగింది. చెరువులు కుంటలు వాగులు వంకలు పొంగిపొర్లాయి. చెరువులకు, నదికి పూజలు చేసిన రైతులు.. గంగాదేవికి మొక్కులు తీర్చుకున్నారు.

జిల్లాలోనే అత్యధికంగా వీరబల్లిలో 149.6 మిల్లీ మీటర్లు వర్షపాతం నమోదు కాగా.. రాయచోటిలో 132.2 మిల్లీ మీటర్లు, గాలివీడు లో 89.2 మిల్లీ మీటర్లు, రామాపురం లో 60.2 మిల్లీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. రైతులు ఖరీఫ్ పంటల సాగుకు సమాయత్తమవుతున్నారు. చెరువులు కుంటల్లోకి నీరు చేరగా.. అధికారులు అప్రమత్తమై వాటి పర్యవేక్షణపై జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఇదీ చదవండి:

జిల్లాలో వెయ్యి దాటిన కరోనా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.