కడప జిల్లాలో మరోసారి ఈదురు గాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో.. ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. కోతకు వచ్చిన మామిడి కాయలు నేల రాలి భారీ నష్టం జరిగింది.
కొన్ని మామిడిచెట్లు కూకటివేళ్లతో సహా లేచి పోవడం.. తీరని నష్టాన్ని కలిగించింది. కర్ఫ్యూ ఆంక్షలతో ధరలు లేక, కాయలు కొనేందుకు వ్యాపారులురాక.. చెట్లకే ఉండిపోయిన మామిడికాయలన్నీ నేలరాలాయని రైతులు వాపోయారు. రాజంపేట, రైల్వే కోడూర్ ప్రాంతాల్లో... అరటి, బొప్పాయి తోటలు దెబ్బతిన్నాయి.
ఇదీ చదవండి: