ETV Bharat / state

ఆర్టీసీ డిపోల ఆధ్వర్యంలో హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు

author img

By

Published : Mar 17, 2020, 7:36 PM IST

పెద్ద పెద్ద వాహనాలను ఒక చిన్న స్టీరింగ్​తో కంట్రోల్​ చేసే డ్రైవర్లకు డిమాండ్​ అంతా ఇంతా కాదు. అవునండీ.. నేడు భారీ వాహన డ్రైవర్లకున్న డిమాండే వేరు. అయినప్పటికీ అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని అన్నట్లుంది వీరి పరిస్థితి. అందుకే ఆ సమస్యను అదిగమించేందుకు ఆర్టీసీ నడుం భిగించింది. ఇంతకీ ఎంటా సమస్య.. అనేదేగా మీ సందేహం లేటెందుకు.. చూసేయండీ...

training centers under RTC department
ఆర్టీసీ డిపోల ఆధ్వర్యంలో హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు

నేడు భారీ వాహనాల డ్రైవర్లకు మంచి డిమాండ్ ఉంది కానీ డ్రైవర్​గా శిక్షణ పొందేందుకు సరైన సంస్థలు లేవు. ఎక్కడో ఒకచోట ఎలాగోలా.. శిక్షణ కానిచ్చేస్తున్నారు. అనంతరం లైసెన్స్ పొందేందుకు నాలుగు చక్రాల భారీ బళ్లు నడిపే వారి బాధలు.. ఆ నాలుగు దిక్కులకే తెలియాలన్నట్లుంటుంది. ఈ సమస్యలన్నింటికి చెక్ పెట్టేందుకు ఆర్టీసీ ముందుకొచ్చింది. రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ కేంద్రాల్లో ఆర్టీసీ డిపోల ద్వారా హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచించింది.

పార్లమెంట్ కేంద్రాల్లోని డిపోల్లో ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి శిక్షణ కేంద్రాలను ప్రారంభించనున్నారు. ఆయా డిపోల పరిధిలోని ప్రజలు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఇక్కడ శిక్షణ పొందవచ్చు. అయితే శిక్షణ పొందాలనుకునే వారు రెండేళ్ల ముందే లైట్ డ్రైవింగ్ లైసెన్స్​ను పొంది ఉండాలి. రుసుముతోపాటుగా జీఎస్టీని ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. ఆర్టీసీలో 30 నుంచి 35 సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం కలిగిన నిపుణులైన డ్రైవర్లతో శిక్షణ ఇప్పిస్తామని కడప జిల్లా రాజంపేట ఆర్టీసీ డిపో మేనేజర్ బాలాజీ తెలిపారు. గతంలో హెవీ డ్రైవింగ్ లైసెన్స్ పొందాలంటే వాహనచోదకులు చాలా ఇబ్బందులు పడేవారని, ఇప్పుడు అలాంటి సమస్యలు ఉండవని ఆయన పేర్కొన్నారు.

ఇవీ చూడండి...

'ప్రభుత్వం గెలిచినా ఓడినట్లే... ప్రతిపక్షాలు ఓడినా గెలిచినట్లే'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.