కడప జిల్లా దువ్వూరు మండలం ఇడమడక చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రూ. 6 లక్షలు విలువ చేసే నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కర్నాటక రాష్ట్రం నుంచి గుట్కాను అక్రమంగా తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశారు. నిషేదిత వస్తువులు సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇదీ చదవండి 'నమ్మి కోట్లలో అప్పుఇచ్చాం... న్యాయం చేయండి'