కడప జిల్లా రైల్వేకోడూరు పట్టణం నుంచి రెడ్డివారిపల్లి, చియ్యవరం గ్రామ పంచాయతీలకు వెళ్లే ప్రధాన రహదారి వద్ద ఉన్న గుంజన ఏరు వంతెన కూలేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయాపై 'ఈటీవీ భారత్'లో 'బ్రిడ్జి కుంగి పోయింది..మరమ్మతులు చేపట్టరూ..' అనే కథనం ప్రసారం అయింది. 'ఈనాడు'లో 'కొరముట్లా..దారేట్ల' కథనం ప్రచురితమైంది. ఈ కథనాలకు స్పందించిన స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు గుంజన ఏరు బ్రిడ్జిని పరిశీలించారు.
బ్రిడ్జి అంతటిని పరిశీలించిన కొరముట్ల శ్రీనివాసులు బ్రిడ్జి మరమ్మతుల గురించి అధికారులతో మాట్లాడారు. రైల్వేకోడూరు నియోజకవర్గంలో దాదాపు రూ. 150 కోట్లకు పైగా పనులు చేశామని అంతేకాకుండా ... అనేక అభివృద్ధి కార్యక్రమాలకు 2వేల కోట్ల రూపాయలకు పైగా ఎస్టిమేట్లు తయారు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ బ్రిడ్జి కోసం 12 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేసి సీఎం దగ్గర ఆమోదం పొందామని త్వరలో టెండర్లు పిలిచి ఈ వంతెనను పూర్తి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 36 కరోనా పాజిటివ్ కేసులు