కడప జిల్లా రాయచోటి పురపాలక సంఘంలో తెల్లవారు జామున 6 గంటల నుంచే ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయ ఖానంలు పర్యటించారు. సమస్యల పరిష్కారమే ధ్యేయంగా, పట్టణ పారిశుధ్యం, అభివృద్దే ప్రధాన అజెండాలుగా పని చేస్తామని వారు పేర్కొన్నారు. గడప గడపకు వెళ్లి ప్రజల సమస్యలపై ఆరా తీశారు. స్థానికంగా పరిష్కరమయ్యే సమస్యలును అక్కడికక్కడే పరిష్కరిస్తూ.. మిగిలిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పెన్షన్లు, వైఎస్ఆర్ ఆసరా, చేయూత, సున్నా వడ్డీ, ఆమ్మఒడి, ఇళ్ల పట్టాలు, పక్కాగృహాలు తదితర ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించాలని ఆయన అధికారులను ఆదేశించారు.
అవసరమైన చోట్ల డ్రైనేజీ, సిమెంట్ రోడ్ల నిర్మాణాలును చేపట్టాలన్నారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.మూడోవ వార్డు సచివాలయాన్ని ఆయన సందర్శించారు.వార్డులో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను త్వరితగతిన ప్రారంభించాలని ఆయన అధికారులను ఆదేశించారు. పురపాలక సంఘం ఛైర్మన్ ఫయాజ్ భాష, వైస్ ఛైర్మన్ దశరథరామిరెడ్డి, కమిషనర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా మైదుకూరులో ప్రదర్శన