ఎంఎస్ఎంఈ సెక్టర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తున్న కారణంగా.. యువతకు సొంత జిల్లాల్లో ఉద్యోగ అవకాశాలు అందుతున్నాయని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా పేర్కొన్నారు. రాష్ట్రంలోని దాదాపు లక్ష... సూక్ష్మ, చిన్న తరహా ఎంఎస్ఎంఈలకు రీస్టార్ట్ ప్యాకేజీ ద్వారా రూ.1110 కోట్లను నేరుగా వారి ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించగా.. ఉపముఖ్యమంత్రితో పాటు కలెక్టర్ సి.హరికిరణ్ హాజరయ్యారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ కేటగిరీలకు చెందిన 772 యూనిట్లకు గాను మొదటి దశలో మంజూరైన రూ. 48.97 కోట్లను విడుదల చేసినట్టు కలెక్టర్ తెలిపారు. రెండో దశలో జూన్ 29న మిగతా లబ్ది మొత్తాన్ని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారన్నారు. అనంతరం జిల్లా ఎంఎస్ఎమ్ఈలకు మంజూరయిన రూ.48.97 కోట్ల మెగా చెక్కును ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్ చేతులమీదుగా లబ్దిదారులు అందుకున్నారు.
ఇదీ చదవండి: