కడప జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో వేరుశనగ పంట సాధారణ విస్తీర్ణం 24,593 హెక్టార్లు. వ్యవసాయ శాఖ ద్వారా రాయితీలో కె-6 రకం 35 వేల క్వింటాళ్లు, నారాయణి రకం 16,244 క్వింటాళ్లు ఇచ్చేందుకు తొలుత అనుమతించారు. ఈ రెండు రకాలు కలిపి 51,244 క్వింటాళ్లు సేకరించాలని లక్ష్యాన్ని నిర్దేశించారు. ఈలోపు గత ఏడాది ఖరీఫ్‌లో రైతులు ఎన్ని క్వింటాళ్లను కొనుగోలు చేశారో ఈసారి అంతే ఇస్తామని ఉన్నతాధికారులు కోత పెట్టారు. తాజాగా అందిన కుదింపు చూస్తే జిల్లాకు కేవలం 30,703.2 క్వింటాళ్లు ఇస్తారు.
మొదటి అనుమతి ప్రకారం చూస్తే ఏకంగా 20,540.8 క్వింటాళ్లను తగ్గించినట్లే. ‘జిల్లాలో వేరుశనగ పంట సాగు చేసే రైతులకు తొలుత 51 వేల క్వింటాళ్లను మంజూరు చేశారు. విత్తన కేటాయింపుల్లో తాజాగా సవరణ చేశారు. గతేడాది ఖరీఫ్‌లో రైతులు ఎన్ని క్వింటాళ్లను కొనుగోలు చేశారో అంతే మోతాదులో కేటాయించారు’అని వ్యవసాయ శాఖ జిల్లా సంయుక్త సంచాలకుడు జె.మురళీకృష్ణ చెప్పారు.
ఇదీ చదవండి: