లాక్డౌన్ సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సహాయక చర్యలు చేపడితే ఆంక్షలు పాటించలేదంటూ అసత్య ప్రచారాలు చేశారన్నారు చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి. ప్రాణాలకు భయపడి తెదేపా నాయకులు ఎవరూ ప్రజల ముందుకు రాలేదని విమర్శించారు.
జూలై 8న రాష్ట్రంలో 27 లక్షల మందికి నివాస స్థలాల పట్టాలు ఇస్తామని కడపలో స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు మహానాడులో చేసిన ఛాలెంజ్ స్వీకరిస్తున్నామన్న ఆయన నియోజకవర్గంలోని ఏ గ్రామంలోనైనా సంక్షేమ పథకాలపై చర్చకు సిద్ధమేనన్నారు. ఏడాది పనులను విజయవంతంగా కొనసాగించిన ముఖ్యమంత్రి జగన్కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు ఆసిఫ్ అలీ ఖాన్ పాల్గొన్నారు.
ఇవీ చూడండి...