కడప జిల్లా బద్వేల్‌లోని బాలుర ఉన్నత పాఠశాలలో 1500 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠశాలలో భోజనశాల లేని కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యాహ్నం తినే సమయంలో గాలికి దుమ్ము లేచి ఆహారం మీద పడుతుంది. అంతేగాక ఎండలో, వర్షం వచ్చినపుడు చెట్ల కింద, తరగతి గదిలోకి వెళ్లి తినాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 3వేల 225 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో లక్షా75వేల 311 బాలబాలికలు చదువుకుంటున్నారు. చాలా పాఠశాలలో భోజనశాల కొరత కనిపిస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుకుంటున్నారు.
ఇది చూడండి.పిల్లి బాబూ..ఎక్కడున్నావ్..!