ETV Bharat / state

ఉల్లాసంగా.. ఉత్సాహంగా గొబ్బెమ్మ పండగ

author img

By

Published : Jan 15, 2020, 10:06 AM IST

కడప జిల్లా రాజంపేటలో గొబ్బెమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కొలిమి వీధిలో ధనుర్మాసం పురస్కరించుకొని ఏటా గొబ్బెమ్మ వేడుకలను కనులపండువగా జరుపుతారు. ఆ వీధిలో గొబ్బెమ్మ పాటలు వినసొంపుగా ఉంటాయి. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత మంచి రోజు చూసుకొని గౌరమ్మ ప్రతిమను తయారుచేసి ప్రతి రోజు పూజలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొలిమి వీధిలోని ప్రతి ఇంటిలోని మహిళలు అక్కడికి చేరుకొని గొబ్బెమ్మ పాటలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సందడి చేస్తారు.

gobbemma festival in rajampeta
రాజంపేటలో వైభవంగా ధనుర్మాస గొబ్బెమ్మ వేడుకలు
రాజంపేటలో వైభవంగా ధనుర్మాస గొబ్బెమ్మ వేడుకలు

రాజంపేటలో వైభవంగా ధనుర్మాస గొబ్బెమ్మ వేడుకలు

ఇదీ చదవండి

గెలుపు నీదా...నాదా..సై

Intro:Ap_cdp_46_15_VO_pratyekam_gobbemma vedukalu_Av_Ap10043
k.veerachari, 9948047582
ఆ వీధిలోకి అడుగు పెడితే గొబ్బెమ్మ పాటలు చెవులకు వీనులవిందుగా వినిపిస్తాయి. ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంటుంది. ఆ వీధిలోని మహిళలు, యువతులు, పిల్లలు సైతం గొబ్బెమ్మ పాటలతో సందడి చేస్తారు. ఇది ఈ వీధి లోని ప్రత్యేకత. కడప జిల్లా రాజంపేట పట్టణంలోని కొలిమి వీధిలో ధనుర్మాసం పురస్కరించుకొని ఏటా గొబ్బెమ్మ వేడుకలను కనులపండువగా నిర్వహిస్తారు. ధనుర్మాసం ప్రారంభమైన తర్వాత మంచి రోజు చూసుకొని గౌరమ్మ ప్రతిమను తయారుచేసి ప్రతి రోజు పూజలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఈనెల ఆరో తేదీ నుంచి గౌరమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఆరున్నర గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొలిమి వీధిలోని ప్రతి ఇంటిలోని మహిళలు, యువతులు, పిల్లలు అక్కడికి చేరుకొని గొబ్బెమ్మ పాటలతో ఉత్సాహంగా, ఉల్లాసంగా సందడి చేస్తున్నారు. గొబ్బెమ్మ పాటలు రాకపోయినా అంతర్జాలం, యూట్యూబ్ వంటి సాధనాల ద్వారా తెలుసుకొని నేర్చుకుని పాడుతున్నారు. పండుగ మూడు రోజులు గౌరమ్మను తీసుకొని ఇంటింటికి వెళతారు. అక్కడ అ ప్రతి ఇంటి వారు అమ్మవారికి పూజలు చేసి హారతులు పడుతున్నారు. ఇలా గొబ్బెమ్మ వేడుకలను నిర్వహించుకుంటూ ఈనెల 18న అమ్మవారి గ్రామోత్సవం ఉంటుందని మహిళలు తెలిపారు. అందరి సహకారంతో అందరికీ మేలు జరగాలనే సంకల్పంతో ఈ వేడుకలను ఏటా నిర్వహిస్తున్నామని వారు తెలిపారు.


Body:వైభవంగా ధనుర్మాస గొబ్బెమ్మ వేడుకలు


Conclusion:1. మానస, కొలిమివీధి, రాజంపేట.
2. లక్ష్మి, కొలిమివీధి, రాజంపేట.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.