ETV Bharat / state

పుష్పగిరిలో పున:ప్రారంభమైన`గిరి’ ప్రదక్షిణ - ఏపీ వార్తలు

Giri Pradakshina in Pushpagiri : `గిరి’ ప్రదక్షిణ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది అరుణాచలం.. అరుణాచలంలో గిరి ప్రదక్షిణ దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పుష్పగిరికి శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహ సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకరభారతి స్వామి రాకతో మళ్లీ ఇక్కడ గిరి ప్రదక్షిణకు పున:ప్రారంభమైంది. శ్రీ విద్యాశంకరభారతి స్వామి ప్రథమంగా పుష్పగిరిలోని స్వామి, అమ్మ వారిలను దర్శించుకున్నారు. అనంతరం గిరి(కొండ)కు పూజలు చేసి గిరి ప్రదక్షిణలో పాల్గొనడంతో భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో కమలాపురం ఎమ్మెల్యే పిరవీంద్రనాథ్రెడ్డి, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.

Giri Pradakshina
గిరి ప్రదక్షిణ
author img

By

Published : Mar 1, 2023, 8:31 PM IST

Giri Pradakshina in Pushpagiri: వాస్తవానికి గిరి ప్రదక్షిణలకు హేతువు, మూలాధారమైన దక్షిణ కాశీగా పేరొంది.. చారిత్రకంగా ప్రసిద్దిగాంచిన వైయస్ఆర్ జిల్లా కమలాపురం నియోజకవర్గం వల్లూరు మండలంలోని పుష్పగిరి. గిరి ప్రదక్షిణ నిర్వహించే విషయం నేటి తరానికి తెలియదు. వందేళ్ల క్రితం పుష్పగిరిలో గిరి ప్రదక్షిణ అట్టహాసంగా జరిగి పరిస్థితుల ప్రభావంతో నిలిచిపోయిన అంశం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ స్థితిలో పుష్పగిరికి శ్రీ జగద్గురు పుష్పగిరి శంకరాచార్య మహ సంస్థాన పీఠాధీశ్వరులు శ్రీ విభూషిత శ్రీ విద్యాశంకరభారతి స్వామి రాకతో మళ్లీ ఇక్కడ గిరి ప్రదక్షిణకు పున:ప్రారంభమైంది. తర్వాత ఆంధ్రప్రదేశ్​లో సింహాచలంలో నిర్వహిస్తున్న గిరి ప్రదక్షిణ ఉత్తరాంధ్ర ప్రజలకు చిరపరిచితమే.. ఇటీవల విజయవాడ కనకదుర్గమ్మ కొండ చుట్టూ కూడా గిరి ప్రదక్షిణను నిర్వహిస్తున్నారు. అదేరీతిలో తెలుగురాష్ట్రాల్లో పలు దేవాలయాల్లోనూ క్రమక్రమంగా గిరి ప్రదక్షిణలను ప్రారంభిస్తున్నారు.

Giri Pradakshina
గిరి ప్రదక్షిణ

పుష్పగిరి చరిత్ర..: 100 సంవత్సరాల క్రితం పుష్పగిరి పుణ్యక్షేత్రానికి సంబంధించి దాదాపు 100 శివాలయాలకుపైగా కొండ చుట్టూ ఉండేవి. ఆకారణంగా ఒక్కసారి గిరి ప్రదక్షిణ చేస్తే 100 శివాలయాలను సందర్శించి పుణ్యం కలుగుతుందని భక్తుల్లో విశ్వాసం ఉండేది. ఆ విధంగా గిరి ప్రదర్శనకు గతంలో అంకురార్పణ జరిగింది. గిరి ప్రదక్షిణ చేసిన భక్తులు కోరుకున్న కోరికలు ఆ మహానుభావుడు తీరుస్తాడని భావిస్తారు. సంతానం లేని వారు గిరి ప్రదక్షిణ చేస్తే సంతానం కలుగుతుందన్న నమ్మకం ప్రబలంగా ఉంది.

శివాలయాలు శిథిలావస్థతో గిరి ప్రదక్షిణకు ఆటంకం..: కొన్నాళ్లకు అక్కడి శివాలయాలు శిథిలావస్థకు చేరుకోవడంతో గిరి ప్రదక్షిణ కూడా ఆగిపోయిందని చెబుతున్నారు. అనంతరం ఇప్పుడు పీఠాధిపతుల అనుమతులు తీసుకొన్న హిందూ పరిషత్ ముఖ్యులు మార్చి 1వ తేదీన మళ్లీ ఈ గిరి ప్రదర్శనను ప్రారంభించారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి కడప పట్టణానికి 16 కి.మీ. దూరంలో ఉంది.

ఆదిశంకరులు సందర్శించిన పుణ్యభూమి..: ఆదిశంకరులు పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ విద్యారణ్యస్వామి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. కడప నుంచి కర్నూలుకు వెళ్ళే మార్గంలో చెన్నూరు సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య పెన్నా నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. వైష్ణవులు దీనిని 'మధ్య అహోబిలం' అనీ, శైవులు దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు.

పుష్పగిరి దేవాలయం..: ఈ గ్రామాన్ని గురించి తెలుగులో తొలి యాత్రాచరిత్రగా చెప్పబడే కాశీయాత్ర చరిత్రలో ప్రస్తావనలున్నాయి. గ్రంథకర్త ఏనుగుల వీరాస్వామయ్య తన కాశీయాత్రలో ఈ గ్రామంలో 1830 సంవత్సరాంతంలో విడిది చేశారు. ఆ సమయంలో తాను గమనించి గ్రామవిశేషాలను గ్రంథంలో చేర్చుకున్నారు. గ్రంథంలో ఆయన పుష్పగిరి గురించి ఇలా వ్రాశారు: పుష్పగిరి పుణ్యక్షేత్రము. పినాకినీ తీరము. నది గట్టున కొండ వెంబడిగా రమణీయమైన యొక దేవస్థల మున్నది. అది హస్తినిక్షేపము చేయతగిన పుణ్యస్థలము. స్మార్త పీఠాధిపతి అయిన పుష్పగిరి స్వాములవారు, అక్కడ మఠము గట్టుకొని నివాసము చేస్తున్నారు. 18 బ్రాహ్మణ గృహములున్నవి. అక్కడి బ్రాహ్మణులు కొంత వేదాంత విచారణ గలవారుగా కనబడుచున్నారు. అన్ని వస్తువులకు పేటకు పోవలెగాని, అక్కడ దొరకవు. నది దాటి ఊరు ప్రవేశించవలెను, మళ్లీ నది దాటి బాటకు రావలెను. ఊరు రమ్యమైనది.

పురాణ ప్రాశస్త్రం..: ఈ ప్రాంతంలో కాంపల్లె అనే గ్రామం ఉండేది. గరుత్మంతుడు ఇంద్రుని అమృతభాండాన్ని తీసుకుని వస్తున్నాడు. ఇంద్రుడు అడ్డగించాడు. ఇరువురికీ పోరాటం జరిగింది. ఆ సమయంలో అమృతభాండం నుంచి కొన్ని చుక్కలు కాంపల్లె సమీపంలోని కోనేటిలో పడ్డాయి. నాటి నుంచి ఆ కోనేటిలో మునిగే వారికి యౌవనం లభించేది, అమరత్వమూ సిద్ధించేది. దేవతలు భయపడి శివుణ్ణి ఆశ్రయించారు. శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించాడు. వాయువు కైలాస పర్వతం నుంచి ఒక ముక్కను తెచ్చి ఆ కోనేటిలో వేశాడు. అది కోనేటిలో పుష్పం వలే తేలింది. అదే పుష్పగిరి అయింది అని పురాణంలో ప్రస్తావన ఉంది.

పంచనదీక్షేత్రం..: పుష్పగిరి సమీపంలో పాపఘ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నలో కలుస్తాయి. అందుకే పుష్పగిరిని పంచనదీక్షేత్రమంటారు. పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించారు. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.

హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి..: శివ స్వరూపుడైన వైద్యనాదేశ్వరుడు, విష్ణు స్వరూపుడైన చెన్నకేశవస్వామి నిలయమైన పుష్పగిరి హరిహర క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఆద్భుత శిల్ప సౌందర్యంతో అపురూప కట్టడాలతో ఈ క్షేత్రం అలరారుతోంది. పరీక్షిత్తు వంశాన్ని నిర్వీర్యం చేయడానికి జనమేజయుడు చేసిన సర్పయాగ పాప పరిహారార్థం శుక మహర్షి ఆదేశంపై పుష్పగిరి కొండపై ఈ ఆలయమును నిర్మించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది.

చారిత్రక నేపధ్యం..: చోళులు, పల్లవులు, కృష్ణదేవరాయలు ఆ తర్వాతి కాలంలో ఆలయాన్ని అభివృద్ధి చేశారని చరిత్ర ద్వారా తెలుస్తుంది. కొండ మీద ఒకే ఆవరణంలో చెన్నకేశవాలయం, సంతాన మల్లేశ్వరాలయం ఉన్నాయి. ఈ ఆవరణంలోనే ఉమా మహేశ్వర, రాజ్యలక్ష్మి, రుద్రపాద, యోగాంజనేయ, సాక్షిమల్లేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోవచ్చు. పుష్పగిరిలోనే పాపవినాశేశ్వరుడు, డుంటి వినాయకుడు, పుష్పనాథేశ్వరుడు, కమలసంభవేశ్వరుడు, దుర్గాంబ ఆలయాలున్నాయి. రుద్ర పాదము, విష్ణు పాదము ఈ కొండ మీదనే ఉన్నాయి.

పలు ఆలయాలకు నెలవు..: పుష్పగిరిలో కింద వైద్యనాదేశ్వర, త్రికుటేశ్వర, భీమలింగేశ్వర, కామాక్షి అమ్మవారి ఆలయాలున్నాయి. వైద్య నాథేశ్వరుడు, భీమేశ్వరుడు, త్రికూటేశ్వరుడు ఇక్కడ నెలకొని ఉన్నారు. వైద్య నాథేశ్వరాలయంలో శ్రీ కామాక్షి మందిరం ఉంది.

వరదలు వస్తే..: వరదలు వచ్చినప్పుడు పెన్న దాటి ఆవలి వైపునకు వెళ్ళలేరు. అప్పుడు ఈవలి వైపు అభినవ చెన్నకేశవ స్వామికి పూజలు జరుగుతాయి. పాతాళ గణపతిని దర్శించుకొని పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్వహస్తాలతో ప్రతిష్ఠించిన శ్రీ చక్రాన్ని దర్శించుకోవడం భక్తులు భాగ్యంగా భావిస్తారు.

శిల్పకళాసంపదకు పెట్టింది పేరు..: పుష్పగిరి శిల్పకళాసంపదకు పేరు. ఆలయం బయటి గోడలపైన ఉండే శిల్పాలు చూడముచ్చటగా ఉంటాయి. అక్కడ ఏనుగుల వరసలు, గుఱ్ఱాల మీద వీరుల విన్యాసాలు రమ్యంగా ఉన్నాయి. భారత రామాయణాల్లోని ముఖ్య ఘట్టాలు చిత్రీకరించబడ్డాయి. కిరాతార్జున గాథ చిత్రించబడింది. నటరాజ నృత్యం చూసి తీరాలి. ఇక్కడి శిల్పాలలో సౌందర్యం తొణికిసలాడుతూ ఉంటుంది.

ఏప్రిల్ 15 నుంచీ బ్రహ్మొత్సవాలు..: పవిత్ర పినాకిని నదీ తీరంలో వెలసి దక్షిణ కాశిగా పేరొందిన పవిత్ర పుణ్యక్షేత్రం పుష్పగిరిలో ఏప్రిల్ 15 నుంచీ బ్రహ్మొత్సవాలు జరుపనున్నారు. శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామి, శ్రీ వైద్యనాదేశ్వరస్వామి వార్ల వార్షిక బ్రహ్మోత్సవాలు 24 వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి.

విష్వక్సేన పూజతో ప్రారంభం..: శ్రీ లక్ష్మి చెన్నకేశవస్వామికి ఈ ఏప్రిల్ 15 న విష్వక్సేన పూజతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. 21 న కళ్యాణోత్సవం, 22 న రథోత్సవం, 23 న ఆశ్వవాహన సేవ, 24 న చక్రస్నానం, పూర్ణాహుతి, పుష్పయాగం నిర్వహిస్తారు. శ్రీ వైద్యనాదేశ్వరస్వామికి ఏప్రిల్ 15 న మృత్య్సంగ్రహణం, అఖండ దీపారాధన, 21న కళ్యాణోత్సవం, 22న రథోత్సవం, 23న నిత్యహోమం, 24న చక్రస్నానం నిర్వహిస్తారు. బ్రహ్మొత్సవాలలో మూడు రోజు ల పాటు తిరునాళ్ల జరుగుతుంది.

పుష్పగిరి చేరాయాలంటే..: పుష్పగిరి చేరుకోడానికి మూడు మార్గాలున్నాయి. కడప నుండి చెన్నూరు మార్గంలో ఉప్పరపల్లి మీదుగా కొండకు చేరుకొవచ్చు. ఖాజీపేట నుంచి వయా చింతలపత్తూరు మీదుగా భక్తులు వచ్చేందుకు వీలుగా వాహనాలు ఎక్కువగా తిరుగుతాయి. జాతీయరహదారిపై తాడిపత్రి నుంచి వల్లూరు వయా ఆదినిమ్మాయపల్లె దారి మీదుగా వెళ్లవచ్చు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.