గండికోట ప్రాజెక్టు ముంపు బాధితులకు ప్రభుత్వం తరుపున 10 లక్షల పరిహారం ఇప్పిస్తామని కడప ఎంపీ అవినాష్ రెడ్డి తెలిపారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని గండికోట ప్రాజెక్టు నుంచి మైలవరం జలాశయానికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో కలిసి నీటిని విడుదల చేశారు. పునరావాస కేంద్రాల స్థల పరిశీలన చేసి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. గత ప్రభుత్వం కేవలం 12 టీఎంసీలు మాత్రమే నీల్వ ఉంచగలిగితే.. వైకాపా ప్రభుత్వం 40 టీఎంసీల నీటిని నిల్వ ఉంచిందని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అన్నారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందింస్తున్నామని తెలిపారు.
ఇది కూడా చదవండి.