'అక్టోబర్ 15 నుంచి 31 వరకు గాంధీజీ సంకల్పయాత్ర'
'15 నుంచి ఏపీలో గాంధీజీ సంకల్పయాత్ర' - gandhi sankalp yatra in kadapa district
గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 15 నుంచి 31 వరకు గాంధీజీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు భాజపా కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనాథ్రెడ్డి తెలిపారు.

'అక్టోబర్ 15 నుంచి 31 వరకు గాంధీజీ సంకల్పయాత్ర'
'అక్టోబర్ 15 నుంచి 31 వరకు గాంధీజీ సంకల్పయాత్ర'
Intro:Ap_cdp_41_13_gandhi_sankalpa_yatra_avb_ap10041
Place: proddatur
Reporter: madhusudhan
గాంధీజీ 150వ జయంతిని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా గాంధీజీ సంకల్పయాత్ర నిర్వహిస్తున్నట్లు బిజెపి కడపజిల్లా జిల్లా అధ్యక్షులు శ్రీనాథ్ రెడ్డి అన్నారు. కడపజిల్లా ప్రొద్దుటూరులోని ఎంపీ సీఎం రమేష్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీనాథ్రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా మన రాష్ట్రంలో అక్టోబర్ 15 నుంచి 31 వరకు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. అక్టోబర్ 15న ఎర్రగుంట్ల మండలం పోట్లదుర్తి గ్రామం నుంచి ఎంపీ సి.ఎం.రమేష్ నేతృత్వంలో గాంధీ సంకల్పయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ , బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బిజేపీ ఏపీ బాధ్యులు సునీల్ డియోడో రాష్ట్ర కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఇతర నాయకులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. పోట్ల దుర్తి నుంచి ప్రారంభమైన గాంధీ సంకల్పయాత్ర ప్రొద్దుటూరు మీదుగా కొర్రపాడు వరకు కొనసాగుతుందన్నారు. మరుసటి రోజున మైదుకూరు నుంచి వనిపెంట వరకు కొనసాగుతుందని చెప్పారు అక్టోబర్ 31న ఈ గాంధీ సంకల్పయాత్ర ముగుస్తుందని ఆయన చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో 15 కిలోమీటర్ల మేర గాంధీజీ సంకల్పయాత్ర పాదయాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీ గాంధీజీని అడ్డంపెట్టుకుని ఎన్నికల్లో లబ్ధి పొందారు తప్ప ఆయన ఆశయాలను కొనసాగించ లేదని విమర్శించారు. నరేంద్ర మోడీ గాంధీజీ ఆశయాలను అమలు చేసేందుకు కంకణబద్ధులై గాంధీజీ నిజమైన వారసులుగా చరిత్రలో నిలుస్తామన్నారు.
బైట్: శ్రీనాథ్ రెడ్డి, భాజపా కడపజిల్లా అధ్యక్షుడు.Body:AConclusion:A