ETV Bharat / state

కడపలో ఉచిత వైద్య శిబిరం

author img

By

Published : Mar 8, 2021, 11:04 AM IST

కడప జిల్లా పోలీసులు.. మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని కర్నూల్ రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి అన్నారు. వేడుకలో భాగంగా.. పోలీస్​ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

Free medical camp
కడపలో మహిళా దినోత్సవ సందర్భంగా.. ఉచిత వైద్య శిబిరం

మహిళా దినోత్సవాన్ని కడప జిల్లాల్లో ఘనంగా నిర్వహిస్తున్నారని కర్నూల్ రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. వేడుకల్లో భాగంగా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కడప ఉమేష్ చంద్ర కళ్యాణమండపంలో పోలీసు కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరాన్ని డీఐజీ ప్రారంభించారు. పోలీసులు అనునిత్యం విధులతో సతమతమవుతుంటారు అని, కనీసం కుటుంబ సభ్యులకు వైద్యం కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉంటారని చెప్పారు. అందుకే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కేవలం పోలీస్ కుటుంబాలకు ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన ఉంటుందని అని పేర్కొన్నారు.

ఇదీ చదవండీ.. తనదైన ముద్రవేస్తున్న తితిదే తొలి మహిళా జేఈవో సదా భార్గవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.