కడప జిల్లా వల్లూరు మండలం పుష్పగిరి పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. సరదాగా ఈతకు వెళ్లిన యువకులు నది ప్రవాహం ధాటికి కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చేపట్టారు.
అందులో మూడు మృతదేహాలను వెలికితీయగా... మరోకరి కోసం గాలింపు ముమ్మరం చేశారు. గల్లంతైన యువకులు కడప బెల్లం మండి వీధి వాసులుగా గుర్తించారు. మృతులు అబ్దుల్ రషీద్(18), అనూప్ ఖాన్(15), జవేరియా (12) గా పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: