కడప జిల్లా బద్వేల్ పట్టణంలో స్థానిక సీఐ రామచంద్ర నేతృత్వంలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. పోరుమామిళ్ల రోడ్డు నరసింహ థియేటర్ సమీపంలో నిబంధనలకు విరుద్ధంగా నిల్వ చేసిన 4 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. బద్వేల్‌కు చెందిన వెంకటేశ్వర్లు, సురేంద్రను అరెస్టు చేశారు.
సమీప గ్రామాల్లో ప్రజల నుంచి తక్కువ ధరకు సేకరించిన బియ్యాన్ని.. ప్రొద్దుటూరు, జమ్మలమడుగు ప్రాంతాలకు తరలించి అక్కడ అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందని సీఐ చెప్పారు. చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
ఇదీ చదవండి:
వీరఘట్టంలో 10 లక్షలు విలువచేసే... గుట్కా ప్యాకెట్లు స్వాధీనం