కడప జిల్లా కొంగలవీడు గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డికి... తండ్రి మల్లయ్య పేరుతో మూడు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరికి ఉన్న 228 సర్వే నంబర్లు 28 సెంటర్ వ్యవసాయ భూమి రహదారి పక్కనే ఉంది. దక్షిణ భాగంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. రైతు భూమిలో కొంత భాగాన్ని రహదారి కోసం వినియోగించనున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిలో రోడ్డు వేస్తే తాను ఎలా జీవించాలని సుబ్బారెడ్డి ఆవేదనకు గురవుతున్నాడు. మరోచోట ప్రభుత్వ స్థలాన్ని రోడ్డుకు కేటాయించాలని వేడుకుంటున్నాడు.
'నాకున్న కొద్ది భూమిలో రోడ్డేస్తే...నేనెట్లా బతికేది..?' - badwelu latest news
పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం మంచిదే అయినా రెవెన్యూ అధికారులు తొందరపాటు నిర్ణయాలు బాధితులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయి. భూములు ఇవ్వాలని ఒత్తిడి తేవడం వల్ల అన్నదాతలు మానసికంగా కుంగిపోతున్నారు. కడప జిల్లా బద్వేల్లో కొందరు రైతులు తమ భూమిని తీసుకోవద్దంటూ వేడుకుంటున్నారు.
కడప జిల్లా కొంగలవీడు గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డికి... తండ్రి మల్లయ్య పేరుతో మూడు ఎకరాల భూమి ఉంది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. వీరికి ఉన్న 228 సర్వే నంబర్లు 28 సెంటర్ వ్యవసాయ భూమి రహదారి పక్కనే ఉంది. దక్షిణ భాగంలో పేదలకు ఇళ్ల స్థలాల కోసం రెవెన్యూ అధికారులు భూమిని కేటాయించారు. రైతు భూమిలో కొంత భాగాన్ని రహదారి కోసం వినియోగించనున్నారు. ఉన్న కొద్దిపాటి భూమిలో రోడ్డు వేస్తే తాను ఎలా జీవించాలని సుబ్బారెడ్డి ఆవేదనకు గురవుతున్నాడు. మరోచోట ప్రభుత్వ స్థలాన్ని రోడ్డుకు కేటాయించాలని వేడుకుంటున్నాడు.
ఇవీ చూడండి:
దిక్ సూచీలు సరిలేవు.. ముందున్న మలుపులు తెలీవు..!