కాషాయ తీర్థం పుచ్చుకునేందుకు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి సిద్ధమ్యయారు. 'ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ఆ ఈ దశలో కేంద్ర ప్రభుత్వం మాత్రమే మనల్ని ఆదుకోగలదు..రాయలసీమ ప్రాంతంలో..అందునా కడప జిల్లాలో అభివృద్ధి కాంక్షించే భాజపాలో చేరాలని భావిస్తున్నా' అని ఆయన స్పష్టం చేశారు. పార్టీలో చేరేందుకు త్వరలోనే ముహూర్తం ఖరారు చేయనున్నట్లు వెల్లడించారు. తెదేపా అధినేత చంద్రబాబుతో మంగళవారం రాత్రి మర్యాదపూర్వకంగానే కలిశానని, ఆపార్టీలో కొనసాగే ఉద్దేశం లేదన్నారు.
ఇదీచదవండి