Chief Whip Srikanth Reddy Gherao: కడప జిల్లా రాయచోటి మండలం పెమ్మాడపల్లిలో పర్యటనకు వెళ్లిన చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. వరద నష్టం పరిహారం పంపిణీలో న్యాయం చేయాలంటూ పలువురు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఇళ్లు కోల్పోయిన వారందరికీ నష్టపరిహారం ఇవ్వకుండా కొందరికే చెక్కులు ఇవ్వడం తగదంటూ మహిళలు ప్రశ్నించారు. వాలంటీర్ ఒక వర్గానికి చెందిన వారికే పరిహారం వచ్చేలా చూశాడని శ్రీకాంత్‌రెడ్డి ఎదుట వాపోయారు. ఈ క్రమంలో తమపైనే ఫిర్యాదు చేస్తారా..? అంటూ సదరు మహిళలపై మరోవర్గం వాళ్లు ఘర్షణకు దిగారు. ఫలితంగా ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వెంటనే చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అక్కడ్నుంచి వెనుదిరిగారు.పోలీసులు రంగప్రవేశం చేయటంతో.. వివాదం సద్దుమణిగింది.
ఇదీ చదవండి
MPs spoke in Parliament: రాష్ట్రంలో వరదలపై రాజ్యసభలో ఎంపీలు గళం