కడప జిల్లా కొండాపురం మండలం తాళ్ల పొద్దుటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గండికోట జలాశయంలో నీటి మట్టం పెరగటంతో.. గ్రామాన్ని ఖాళీ చేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తమకు ముంపు పరిహారం ఇస్తేనే గ్రామాన్ని ఖాళీ చేస్తామని గ్రామస్థులు స్పష్టం చేయటంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో జమ్మలమడుగు ఆర్డీవో నాగన్న తాళ్ల పొద్దుటూరు గ్రామానికి చేరుకొని.. ముంపు వాసులతో చర్చలు జరిపారు. ముంపు వాసులకు మద్దతుగా మానవహక్కుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జయశ్రీ, సీపీఐ నాయకులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ముందస్తు జాగ్రత్తగా భారీగా పోలీసులు మోహరించారు.
ఇదీ చదవండి: సిమెంట్ దొంగలించాడని... చెట్టుకు కట్టి కొట్టేశారు!